19, జులై 2013, శుక్రవారం

సభ

అకలి 
అధ్య్లక్షతన
ఖాళీ కడుపే
ఒక బహిరంగ సభ
నినదించే 
పేగులే 
జనం.



--అలిశెట్టి ప్రభాకర్
జాగ్రత్త

జాగ్రత్త......
ప్రతి ఓటూ
ఒక... నీ పచ్చినెత్తురు మాంసం ముద్ద
చూస్తూ చూస్తూ వేయకు ఓ గద్దకి
అది కేవలం
కాగితం మీద గుర్తుకాదు
జీవితం మీద ఎర్తు.
తూర్పో పడమరో నాక్కావలసింది
వెలుతురు అనుకోకు .
వెలుతుర్లను పంచే సూర్యుడే కావాలి
అందరం కలిసే తేవాలి.
అందుకోసం
ప్రతి శ్వాసా ఒక ధ్యాసగా మారాలి
ప్రతి అణువూ ఒక్కటై చేరాలి
ఈ నినాదాల పాదాల కింద
తొక్కుడుపడి పోకండి.
ఆ వాగ్దానాల వజ్రాయుధాలకు
బలి అసలే కాకండి.

--అలిశెట్టి ప్రభాకర్